- Advertisement -
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే డార్లింగ్‌తో డైరెక్టర్ మారుతీ ఓ సినిమా చెయబోతున్నాడు అనే వార్త గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తపై ఇప్పటివరకు అటు ప్రభాస్ గానీ..ఇటు మారుతీ గానీ స్పందించాలేదు..ఈ నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనని స్పష్టమవుతున్నాయి. అంతేకాదు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రాజా డిలక్స్’ టైటిల్‌ను కూడా అనుకున్నారని తెలుస్తోంది.
ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండనుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు సరసన ముగ్గురు భామలు ఆడిపాడనున్నాని సమాచారం. రాశిఖన్నా, మాళవికా మోహన్, శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపికయినట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
- Advertisement -