బాలయ్య ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్స్

30
- Advertisement -

నందమూరి బాలకృష్ణ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవెల్‌లో రానుందట. తొలిభాగంలో బాలయ్య- శివరాజ్ కుమార్​, రెండో భాగంలో రజినీకాంత్ లేదా, మమ్ముట్టి, మోహన్‌ లాల్ ల్లో ఎవరో ఒకర్ని తీసుకోవాలని భావిస్తున్నారట. దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మొత్తానికి బాలయ్య మల్టీస్టారర్ లో నటిస్తే ఆ క్రేజే వేరు.

ఇక ప్ర‌స్తుతం బాల‌కృష్ణ అనిల్ రావిపూడితో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య రెండు ప‌వ‌ర్‌ఫుల్ షేడ్స్ లో న‌టిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని నాన‌క్‌రామ్ గూడ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య‌, కాజ‌ల్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సీన్స్ సెకండ్ హాఫ్ లో వస్తాయని తెలుస్తోంది. సినిమాలో బాలయ్య – కాజల్ లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుందట.

Also Read:IPL 2023: ఫైనల్ లో సిఎస్కే.. ఢీ కొట్టేదేవరూ!

ఇద్దరు పెళ్లి అయిపోయి, తమ జీవిత భాగస్వాములను పోగొట్టుకుని.. ఒంటరి జీవితాన్ని లీడ్ చేస్తూ ప్రేమలో పడతారు అని.. వీరి లవ్ ట్రాక్ నుంచి రెండో పెళ్లి వరకూ సాగే సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంటుంది అని టాక్ నడుస్తోంది. బాలయ్య క్యారెక్టర్ లో కావాల్సిననన్ని వేరియేషన్స్ ను కూడా యాడ్ చేశారు. అందువల్ల పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది అనేది అనిల్ రావిపూడి టీమ్ నమ్మకం. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -