చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ పై క్రేజీ న్యూస్

45
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సడెన్ గా ఒప్పుకున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. అగ్ర దర్శకుడు శంకర్‌ అడిగిన వెంటనే చరణ్ ఈ సినిమాకి కమిట్ అయ్యాడు. కంటెంట్ పై ఎక్కువ ఆలోచించకుండా చరణ్ మొహమాటానికి పోయి, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని ఒప్పుకుని తప్పు చేశాడంటూ ? విమర్శలు కూడా వినిపించాయి. దీనికితోడు, ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, శంకర్ ఇండియన్ 2 పైకి వెళ్ళాడు. ఆ సినిమా కోసం ఫుల్ ఫోకస్ పెట్టాడు. మరి ‘గేమ్‌ ఛేంజర్‌’ పరిస్థితి ఏమిటి ?, అసలుకే సడెన్ గా మొదలైన సినిమా, మధ్యలో ఇలా ఆగుతూ సాగుతూ వెళ్తే ఎలా ?, కచ్చితంగా ఈ సినిమా క్వాలిటీ దెబ్బ తింటుంది అంటూ అభిమానులు కూడా ఫీల్ అయ్యారు.

అలాంటిది ఇప్పుడు ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఓ క్రేజ్ న్యూస్ వినిపిస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ క్వాలిటీ అదుర్స్ అట. “ఆర్ఆర్ఆర్” చిత్రం తర్వాత చరణ్ కి గ్లోబల్ స్థాయిలో పెరిగిన పాపులారిటీ కారణంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా విజువల్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదట. దర్శకుడు శంకర్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చేసిన తర్వాత చరణ్ పై ఎంతో బాధ్యత ఉంటుంది. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు శంకర్ ‘గేమ్‌ ఛేంజర్‌’ ను అద్భుతంగా మలుస్తున్నాడు. అలాగే, ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను కూడా తీసుకోబోతున్నాడు.

ఏది ఏమైనా తనకు వచ్చిన పాపులారిటీని గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టుకోవాల్సిన అవసరం చరణ్ కి ఉంది. దానికి తగ్గట్లు ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుట్ ఫుట్ ఉండాలి. ఇక “ఆచార్య” వంటి డిజాస్టర్ తో చరణ్ పేరుకి, బ్రాండ్ నేమ్ కి డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ సోలోగా హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలి. అప్పుడే చరణ్ కి అంటూ ప్రత్యేక గ్లోబల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. అన్నట్టు ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ IAS అధికారి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా చరణ్‌ ఏకంగా ఏడు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపిస్తారని చెబుతున్నారు. మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

Also Read:డిప్యూటీ సీఎం నివాసంగా ప్రజాభవన్

- Advertisement -