ప‌వ‌న్ ‘OG’ పై క్రేజీ కామెంట్స్

47
- Advertisement -

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న సినిమాల్లో సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓజీ (OG) కూడా ఒక‌టి. ప్ర‌స్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ నేటితో ముగుస్తుంది. త‌ర్వాతి షెడ్యూల్ జులై 9 నుంచి హైద‌రాబాద్‌లోనే ఉండ‌నుంది. మరి ఈ షెడ్యూల్ లో అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాయిన్ అవుతాడా ? లేదా ? అనేది చూడాలి. ఒకవేళ ఈ షూట్ లో పవన్ జాయిన్ అయితే, షూటింగ్ హైదరాబాద్‌లోనా, లేక మంగ‌ళ‌గిరిలోనా అనే విష‌యాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.

ఇక ఈ సినిమాలో నటిస్తున్న ఇద్దరు ప్రముఖ నటులు ఈ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో అర్జున్ దాస్ ఓ కీల‌క పాత్ర చేయ‌నుండ‌గా, ఇప్పుడు ఆయ‌న సినిమా గురించి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతుంది. సుజీత్ తన‌కు సినిమాలోని కొన్ని విజువ‌ల్స్ చూపించాడ‌ని, అందులో ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, స్వాగ్ అదిరిపోయాయ‌ని, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని అసెంబుల్ కావాలని దర్శకుడు సుజిత్ ఓజీని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తున్నారని ట్వీట్ చేశాడు అర్జున్ దాస్. ప్రస్తతం ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ఆ ఆస్తులు ఎలా వచ్చాయి అషురెడ్డి ?

మరోవైపు టాలీవుడ్ సీనియర్ నటుడు కమల్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. కమల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ‘OG’ సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ‘సినిమా రంగంలో నాకున్న ఎంతో అనుభవంతో చెబుతున్నా.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేందుకు OG వస్తోంది. ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా OG. అందులో నేను మంచి రోల్ చేస్తున్నాను. ఒరిజినల్ గ్యాంగ్‌ స్టర్ గా పవన్ లుక్ అదిరిపోతోంది. ఈ సినిమా అయితే కథ అద్భుతం. సినిమా బడ్జెట్ రూ.400-500 కోట్లు దాటుతుందేమో’ అని కమల్ కామెంట్స్ చేశాడు.

Also Read: మహేష్ ఆమె వైపు, త్రివిక్రమ్ ఈమె వైపు

- Advertisement -