- Advertisement -
సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, తెలంగాణ గొర్రెలు మేకల సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు శుక్రవారం డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అజయ్ కుమార్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. త్వరలో మరిన్ని కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయని, అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం గారు,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు,పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు గారు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -