సీపీఎం నామినేషన్‌ తిరస్కరణ..!

419
cpm
- Advertisement -

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు మొత్తం 119 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన సోమవారం 103 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్‌ 3 నామినేషన్ల ఉపసంహరణకు గడువు. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అదేరోజు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు. ఈ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌,బీజేపీ,సీపీఎం,టీడీపీలు ప్రధానంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఉప ఎన్నికల్లో సీపీఎంకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. నామినేషన్‌ పేపర్లు సరిగా లేకపోవడంతో సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు సమాచారం. ఈ విషయమై సీపీఎం వర్గాలు ఆందోళన బాటపట్టాయి. హుజూర్‌నగర్‌ రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌ ఎదుట ఆ పార్టీ అభ్యర్థి శేఖర్‌రావు పార్టీ కార్యకర్తలు బైఠాయింయి తమ నిరసన తెలియజేశారు.

- Advertisement -