బీజేపీ నేతలపై చర్యలు తీసుకొండి..

156
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మునుగోడు మండలం పలివెల గ్రామంలో కూడా ఇదే తరహా దాడులకు తెగపడటంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తదితరులకు గాయాలయ్యాయని వివరించారు. ఇదే తరహా ఘర్షణలకు బీజేపీ నాయకులు పాల్పడితే మునుగోడులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.

పోలింగ్‌ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని కోరారు. బీజేపీ అనేక గ్రామాల్లో దాడులకు పాల్పడుతుందని…చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డి గూడెంలో బీజేపీ నాయకులు తమ వాహనాలలో తెచ్చుకున్న రాళ్ళు, కర్రలతో విచక్షణ కోల్పోయి గ్రామస్థులు, పాత్రికేయులపై దాడులు చేశారన్నారు. ఓటమి భయంతో ఘర్షణ వాతావరణం సృష్టించడం ద్వారా ఎన్నికలను రద్దు చేయించేందుకు బీజేపీ అడుగులేస్తున్నదన్నారు.

బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ తరహా దాడులకు బీజేపీ నాయకులు మునుగోడులో తెగపడటం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికల్లో దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి..

సెక్యూలర్‌ పదాన్ని తప్పుగా చెబుతున్నారు:సీతారం

మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం:ఈసీ

కండల వీరుడికి వై+భద్రత కేటాయింపు

- Advertisement -