ప్రధాని మోదీపై సీపీఐ నారాయణ ఆగ్రహం

34
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మీడియతో మాట్లాడిన ఆయన…మీరు అధికారంలోకి వచ్చాక మీ దత్తపుత్రులు ఎంత దోచుకుతున్నారో లెక్క తియాలని ప్రశ్నించారు. అందులో మీ ప్రథమ పుత్రుడు అదాని…మీరు అధికారంలోకి వచ్చాక లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లారో చెప్పాలన్నారు.

ఇక్కడే ఉండి పెద్ద దత్తపుత్రుడు దేశ సంపద దోచుకుంటుంటే మీరంతా సహకరిస్తున్నారని మండిపడ్డారు. 9 ఏళ్ళల్లో మీ దత్తపుత్రుల దోచుకున్న లెక్కలు చూస్తే ప్రాంతీయ పార్టీలది ఏమి కనిపించదన్నారు. హోల్ సెల్ అవినీతికి ప్రత్యక్షంగా పాత్ర వహించింది మోదీనే అని దుయ్యబట్టారు.

Also Read:మార్నింగ్‌ వాక్‌తో ఆరోగ్యం

నేర పూరిత సమాజానికి బాధ్యత వహించేది మీ హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ దేశాన్ని ముక్కలుగా, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?.. సెంటిమెట్లను రెచ్చగొడుతున్నారన్నారు. అవినీతి లెక్కలు తీయండి… మీ దత్తపుత్రుడు ఎంత తిన్నాడు మిగతవాళ్ళు ఎంత తిన్నారో చెప్పాలన్నారు.

Also Read:‘తొలంగులాసనం’తో ఆ సమస్య దూరం..!

- Advertisement -