- Advertisement -
ఈ నెల 10 నుండి గవర్నర్ తమిళి సై మహిళా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై తనదైన శైలీలో స్పందించారు సీపీఐ నారాయణ.
రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని… మహిళా దర్బార్ ఎందు కోసం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తలపెట్టిన దర్బార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ నారాయణ తెలిపారు.
రాష్ట్రంలో గవర్నర్ పాత్ర అగ్గి రాజేస్తుందని… ఎవరైనా వినతిపత్రం ఇస్తే స్వీకరించి, ప్రభుత్వానికి పంపొచ్చు. అంతే కానీ రాజ్‌భవన్‌ను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు.
- Advertisement -