ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న ప్రజాభవన్‌లో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ నేత నారాయణ. ఏ రాష్ట్రం హక్కులను వారు కాపాడుకుంటూనే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పోలవరం, నీటి తగాదాలపై కూడా స్పందించారు. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను కూడా సున్నితంగా చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు.
ఇద్దరు సీఎంలు భేటీ కావడం శుభదినం అని …విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ, ఆంధ్రా భౌగోళికంగానే విడిపోయిందన్నారు. అయితే తెలుగు మాట్లాడే వారు కలిసే ఉన్నట్లు చెప్పారు.
పరిష్కారం అవ్వని విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నీటి సమస్యలు ఉండేవని, అయితే అవి అంతర్గతంగా ఉండేవని గుర్తు చేశారు.
Also Read:KTR:విద్యార్థుల అరెస్ట్ అప్రజాస్వామికం