సెన్సేషన్ కోసమే ఎంపీపై కత్తితో దాడి:సీపీ శ్వేత

63
- Advertisement -

సెన్సేషన్ క్రియేట్ చేయడానికే నిందితుడు రాజు ఎంపీపై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సిద్దిపేట సీపీ శ్వేత చెప్పారు. కమిషనర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె..ఈ నెల 30రోజున సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందని చెప్పారు. అనంతరం ప్రజలు ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేశారని..ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ ఛానల్స్‌ రిపోర్టర్‌గా పనిచేశాడని… వారం రోజుల క్రితం నిందితుడు ప్రణాళిక ప్రకారం కత్తిని కొనుగోలు చేశాడని వివరించారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిందని..ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని సూచించారు.

Also Read:Rakshit Atluri:నరకాసుర హిట్ అవడం ఖాయం

- Advertisement -