చార్మినార్ యునాని ఘటనపై సీపీ సిరీస్..

505
- Advertisement -

చార్మినార్‌ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్‌ పరమేష్‌పై పోలీసు కమీషనర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈమేరకు పరమేష్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు.

cp

యునాని ఆస్పత్రి వద్ద నిన్న జరిగిన ఘటనపై విచారణకు సీపీ ఆదేశించారు. చార్మినార్‌లోని యునాని ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ గత కొద్ది రోజుల నుంచి వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం విద్యార్థులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.

దీంతో విద్యార్థులను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే క్రమంలో అక్కడ మఫ్టీలో ఉన్న ఓ పోలీసు ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను తొక్కి, గోళ్లతో గట్టిగా గిచ్చాడు. ఆ బాధ భరించలేని సదరు విద్యార్థిని గట్టిగా అరిచి.. కేకలు వేసింది. అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసును పరమేష్‌గా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. పరమేష్‌ చార్మినార్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.

- Advertisement -