ఐబొమ్మ రవి ఓ మాస్టర్ మైండ్ అన్నారు సీపీ సజ్జనార్. వేరే పేరుతొ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు తీసుకున్నాడు అన్నారు. రవి ముందు నుంచే క్రిమినల్ మైండ్ సెట్ తో ఉండే వాడు అన్నారు సజ్జనార్. టెక్నాలజీని లోతుగా వాడుకుని ఈ పైరసీ రాకెట్ నడిపించాడు అన్నారు.
అలాగే ఐ-బొమ్మ రవి గురించి కీలక విషయాలు వెల్లడించారు సజ్జనార్.OTT లో రిలీజ్ అయ్యే సినిమాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్ చేసే వాడు అన్నారు. అదంతా మంచి క్వాలిటీతో వెబ్సైట్ లలో అప్లోడ్ చేసేవాడు అన్నారు.
హై-ఎండ్ టెక్నాలజీతో సీక్రెట్ కెమెరాల ద్వారా కొత్త సినిమాలను రికార్డ్ చేసేవాడు… ఈ మొత్తం పైరసీ రాకెట్ టెలిగ్రామ్ ద్వారా నడిచింది అన్నారు సజ్జనార్. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రవి ఇప్పుడు ఎక్కడున్నాడు? దయచేసి పోలీసులు, ప్రభుత్వం ఏమీ చేయదు అనుకోవద్దు. చట్టాన్ని లైట్ తీసుకుంటే ఏమవుతుందో చూశారు కదా? అన్నారు.అలాగే iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి పాస్‌పోర్టును మీడియాకు చూపించారు సజ్జనార్.
Also Read:కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఈటల సీరియస్..

