- Advertisement -
రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండ్లు సీజ్ చేస్తామని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని చెప్పారు.
ఇప్పటివరకు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన సుమారు 9 లక్షల మందిపై కేసులు చేశామని, 20,591 వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. అందులో 16 వేల ద్విచక్రవాహనాలు, 1401 త్రిచక్రవాహనాలు, 2246 భారీ వాహనాలు, 144 ఇతర వాహనాలు ఉన్నాయన్నారు.
రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అందువల్ల సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని షాపులు, ఆఫీసులు, బ్యాంకులు మూసివేయాలని ప్రకటించారు. ప్రజలు మార్నింగ్‌వాక్, ఈవినింగ్ వాక్‌లు చేయకూడదని సూచించారు.
- Advertisement -