డ్రగ్స్‌ను పూర్తిగా నివారిస్తాం: సీవీ ఆనంద్

24
cv anand

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రక్స్ ను పూర్తిగా నివారించడం జరుగుతుందన్నారు సీపీ సీవీ ఆనంద్. బషీర్ బాగ్ కమిషనర్ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడిన ఆనంద్..నూతన సంవత్సరం సందర్భంగా అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నామని చెప్పారు. ముంబై మొదటి గ్యాంగ్ నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నామని…నైజీరియాన్ వ్యక్తి కీలకంగా ఈ పాత్రలో ఉన్నాడని తెలిపారు.

ఎంతో మందితో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నారని…ముందస్తు సమాచారంతో 17గ్రాముల డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు. ఇలాంటి గ్యాంగ్ ప్రధానంగా యోయో హోటల్స్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఒక గ్రామ్ 10 వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు సీపీ ఆనంద్.