నిమజ్జనానికి 20వేల మందితో బందోబస్తుః సీపీ

89
cp Anjani Kumar

గణేశ్ నిమజ్జనానికి 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్. బాలాపూర్‌ వినాయకుడికి నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాలాపూర్‌ నుంచి కొనసాగే వినాయకుడి శోభాయాత్ర మార్గాలను అంజనీ కుమార్‌, లోకేష్‌ కుమార్‌ పరిశీలించారు.

అనంతరం ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం ఎలా జరుగుతుందో పరిశీలించారు సీపీ. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీజే సౌండ్ సిస్టమ్ వంటివి అనుమతి లేదన్నారు.

పెద్ద పెద్ద టస్కర్ లతో ర్యాలీల వల్ల జంక్షన్ ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వార పోలీస్ ఆఫీసర్స్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు