ప్రశాంతంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమంః సీపీ

362
anjanikumar
- Advertisement -

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్ మెంట్, జీహెచ్ ఎంసీ సిబ్బంది పనిచేశారన్నారు. నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అల్లర్లు కాకుండా చూశామన్నారు.

. గత 15 రోజులుగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేశాం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 22 వేలకు పైగా విగ్రహాలు హుస్సెన్‌సాగర్‌లో నిమజ్జనం చేశాం. పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు 36 గంటల పాటు నిర్విరామంగా కృషి చేశాయి. ఈసందర్భంగా గణేశ్ నిమజ్జన ప్రక్రియలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సీపీ .

- Advertisement -