రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయిః సీపీ

241
anjanikumar

నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు హైదరాబాద్ నగర సిపి అంజనీకుమార్. హైదరాబాద్ లో లోని నాంపల్లి ట్రాఫిక్ కంట్రోల్ రూం లో మీడియాతో మాట్లాడారు సీపీ. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు 25శాతం తగ్గాయన్నారు. వాహనదారులు 100శాతం ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలి. ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ లు తగిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువతలో ట్రాఫిక్ రూల్స్ పై మంచి అభిప్రాయం కలిగించేందుకు అందరిపై బాధ్యత వుంది. ఈసందర్బంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న వాహనదారులకు సిపి చేతుల మీదుగా గిఫ్ట్ కూపన్లు అందజేశారు.