- Advertisement -
చిన్న సైజు పామును చూస్తేనే భయంతో కంపించిపోతాం. భారీ జంతువులే దాని చుట్టుపక్కలకు వెళ్లడానికి హడలిపోతాయి. అలాంటిది ఓ ఆవు మాత్రం తన ప్రతాపాన్ని చూపించింది. అనకొండ కారణంగా తన పిల్లను కోల్పోయిన ఒక ఆవు ఆగ్రహంతో అనకొండతోనే యుద్ధానికి దిగింది. ఈ ఘటన మన దేశంలో మాత్రం కాదు. ఈ ఘటన బ్రెజిల్ పరగ్వే సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది.
పొలంలో ఆవు.. దూడతో కలిసి మేస్తుండగా ఐదు మీటర్ల పొడవున్న అనకొండ అమాంతం ఆ దూడపై దాడిచేసి చంపేసింది. అంతటితో ఆగకుండా దాన్ని మింగేయాలని చూసింది. ఆగ్రహంతో ఉన్న ఆవు అనకొండపై దాడికి దిగింది. దాన్ని కొమ్ములతో పొడిచి చంపాలని ఎంత ప్రయత్నిస్తున్నా వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
- Advertisement -