- Advertisement -
తెలంగాణలో కరోనా మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలియగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత వైజాగ్ మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
చలిజ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కొవిడ్ 19గా తేలింది.. అలాగే నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా కోవిడ్‌గా తేలింది.
Also Read:సీఎం పర్యటన…రైతుల అరెస్ట్
- Advertisement -

