ఆసియా దేశాల్లో విస్తరిస్తున్న కరోనా..

13
- Advertisement -

కరోనా కేసులు పెరగడం ఆరోగ్య నిపుణుల్లో ఆందోళనను రేకెత్తించాయి. గత కొన్ని వారాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడమే కాకుండా చాలాచోట్ల ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరిగింది. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్‌ కారణమని ఇప్పటి వరకు నిపుణులు ప్రకటించలేదు. అయితే, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రక్షణ ఉంటుందన్నారు.
ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాలలో కోవిడ్-19 కొత్త వేరియంట్‌ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాల్లో ఆసుపత్రిలో చేరడం, మరణాలతో పాటు కొత్త కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత తొలిసారిగా కేసులు పెరుగుతున్నాయి.

Also read:కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా

ప్రస్తుతం అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎల్‌పీ.8.1 వేరియంట్‌ ద్వారా కేసులు పెరుగుతున్నాయన్నారు. 70శాతం కేసులకు ఈ వేరియంట్‌ కారణమని.. 9శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్‌ కారహన్నారు. ఒమిక్రాన్‌ అసలు వేరియంట్‌ ప్రస్తుతం కనుమరుగైందని.. ప్రస్తుతం సబ్‌ వేరియంట్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు.

- Advertisement -