BJP:బీజేపీలో కోవర్ట్ రాజకీయం?

51
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీని ఏపీ రాజకీయాలు కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ టీడీపీ కోసం పని చేస్తోందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీ కోవర్ట్ లా పని చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఆ పార్టీలో ముసలం ఏర్పడింది చాలా మంది బీజేపీ నేతలు పురందేశ్వరి విషయంలో అసంతృప్తిగా ఉన్నారట. చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ అధిష్టానం స్పందించక పోయినప్పటికి పురందేశ్వరి మాత్రం అరెస్ట్ ను ఖండించడం, టీడీపీ తో పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నప్పటికి.. టీడీపీ విషయంలో పురందేశ్వరి సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఆమె నిజంగానే టీడీపీ కోవర్ట్ లా పని చేస్తున్నారా అనే సందేహాలు ఏపీ బీజేపీ నేతల్లో వ్యక్తమౌతున్నాయట. .

ఫలితంగా అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్నాయని ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అసలే తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ పరిస్థితి ఆగమ్య ఘోచారంగా మారింది. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ లొసుగులు బయట పడుతుండడంతో ఆ పరిణామాలు తెలంగాణ ఎన్నికల్లో పార్టీని దెబ్బ తీస్తాయనే భయం అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు దగ్గర్లో ఉన్న ముఖ్యనేతలందరు ఎడమొఖం పెడమొఖం గానే ఉంటున్నారు. వారిని తిరిగి గాడిన పెట్టేందుకు జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికి ఫలితం కనిపించడం లేదు. ఇక ఏపీ బీజేపీ నేతలను సైతం తెలంగాణ ప్రచారంలో ఉపయోగించుకోవాలని చూస్తే.. అక్కడేమో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కోవర్ట్ రాజకీయం చుట్టుముట్టింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయిందని తెలుస్తోంది. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి కాషాయ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Also Read:బండి సంజయ్ తిరుగుబాటు.. బీజేపీలో భయం!

- Advertisement -