- Advertisement -
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. వర్మ తాజా చిత్రం ‘డేంజరస్ (మా ఇష్టం)’. ఈ సినిమా ఈనెల 8న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను ఆపేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఆర్జీవీపై సినీ నిర్మాత నట్టికుమార్ పిటిషన్ వేశారు. వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని… ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలనే ఒప్పందం తమ మధ్య ఉందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం తను డబ్బులు ఇవ్వలేదని నట్టికుమార్ తెలిపారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఆర్టీవీ తాజా చిత్రం డేంజరస్ విడుదలను ఆపేయాలని తీర్పును చెప్పింది.
- Advertisement -