వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని శాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తొలి వారంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయిన ఈ సినిమా రెండో వారంలోనూ మంచి వసూళ్లతో అదరగొడుతోంది. రిలీజైన ఐదు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.33.55 కోట్లు వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఓవర్సీస్లోనూ ఈ సినిమా దుమ్ముదులిపేస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడం వల్ల అక్కడా అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. నాలుగు రోజుల్లో 700K డాలర్లు వసూల్ చేసిన ఈ సినిమా, ఐదో రోజు 800K డాలర్ల మార్క్ అందుకుంది. ఇదే వీక్‌లో 1 మిలియన్ డాలర్ క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:ఎండిన వరితో బీఆర్ఎస్ ఆందోళన