- Advertisement -
హీరో నాని నిర్మాతగా వచ్చిన కోర్ట్ సినిమా ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు నటి శ్రీదేవి అపల్లా. తొలి సినిమానే అయినా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు శ్రీదేవి అపల్లా.
తాజాగా కోలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది. తమిళ నిర్మాత, నటుడు కేజీఆర్ సరసన నటించనుంది శ్రీదేవి. ఇది కేజీఆర్‌కు రెండో సినిమా కాగా ఇవాళ ఈ సినిమాకి పూజా కార్యక్రమం నిర్వహించగా, అధికారికంగా చిత్ర ప్రారంభం అయింది.
మినీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాయటం మరియు దర్శకత్వ బాధ్యతలు రీగన్ స్టానిస్లాస్ చేపట్టారు. సంగీతాన్ని ప్రతిభావంతుడైన ఘిబ్రాన్ అందించనుండగా, శ్రోతలకు మధురమైన సంగీతానుభూతిని అందించబోతున్నారు.
Also Read: బాలయ్యతో వెంకీ..బిగ్గెస్ట్ మల్టీస్టారర్!
- Advertisement -

