కొండ చిలువలే పెళ్లి దండలుగా ఒక్కటయ్యారు..

333
Couple exchange golden pythons on their wedding day
Couple exchange golden pythons on their wedding day
- Advertisement -

కొందరికి ఏదైనా మాములుగా చేస్తే కిక్కుండదు. వారికి కొత్తగా ఇంకేదైనా చేయాలన్న తపన ఉంటది. మొన్నామధ్య గాల్లో పెళ్లి చేసుకున్నారని విన్నాం. మరి ఈ పెళ్లి గురించి వింటే దడుచుకుంటారేమో.. ఎందుకంటే వారు పెళ్లిలో వేసుకున్నది పూల దండలు కాదు.. కొండ చిలువలు. ఈ పెళ్లి చైనాలో జరిగింది. వివరాళ్లోకి వెళ్తే.. వధూవరులిద్దరూ వన్యప్రాణి ప్రేమికులు. తమ పెళ్లిని వైవిధ్యంగా చేసుకోవాలనుకున్నారు. ప్రకృతిపై ప్రేమతో తమ పెళ్లిలో దండలకు బదులుగా రెండు పెద్ద కొండ చిలువలను మార్చుకున్నారు. ఆ రెండు కొండ చిలువల్లో ఒకటి 30 కిలోలు, మరొకటి 15 కిలోల బరువున్నాయి. అవి తమ బంధానికి ప్రతీకలని వాళ్లు చెబుతున్నారు.

pythosns wedding

ఈ పోటోలో ముందుగా మెడలో బంగారు రంగు కొండ చిలువను వేసుకున్న వరుడు కనిపిస్తాడు. తర్వాత పక్కన ఉన్న మరో వ్యక్తి సాయంతో ఓ పెద్ద కొండ చిలువను తీస్తాడు. దాన్ని పెళ్లికూతురికి ఇవ్వగా, ఆమె దాన్ని తన మెడలో వేసుకుంటుంది. తర్వాత ఇద్దరూ కౌగలించుకోగా.. ఒక కొండ చిలువ వాళ్లిద్దరి చుట్టూ అల్లుకుంటుంది. తాను జంతుప్రేమికుడినని పెళ్లి కొడుకు వు జియాన్ ఫెంగ్ ఆ తర్వాత చెప్పాడు. వన్యప్రాణులను సంరక్షించాలనే తాము ఇలా కొండ చిలువలు మార్చుకున్నామని అతడు తెలిపాడు.

python_wedding

కొండచిలువలు కనిపిస్తే చంపొద్దని విజ్ఙప్తి చేస్తున్నాడు. చైనాలో కొండ చిలువలతో పాటు పలు రకాల పాములు, బల్లులు లాంటివి చాలా రకాల వన్య ప్రాణులను పెంచుకుంటారట. నిజానికి బంగారు రంగులో ఉన్నది.. బర్మా జాతికి చెందిన కొండ చిలువేనట. అయితే ఆల్బినో కావడంతో అది ఆ రంగులోకి మారింది. వాళ్లు ఇలా కొండ చిలువలను మార్చుకున్న వీడియో చైనా సోషల్ మీడియా వైబోలో విపరీతంగా వైరల్ అయింది.

https://youtu.be/uYiTvoFKQ6c

- Advertisement -