పరిషత్ ఓట్ల లెక్కింపు..ప్రతి నిమిషం అప్‌డేట్‌

317
mptc counting
- Advertisement -

నెలరోజుల ఉత్కంఠకు నేటితో తెరపడనున్నది. మండల పరిషత్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. 5,639 ఎంపీటీసీ, 534 జెడ్పీటీసీ స్థానాలకు గతనెల 6, 10, 14 తేదీల్లో మూడువిడుతలుగా పోలింగ్ జరుగగా మొత్తం 21,356 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.

లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో 978 కౌంటింగ్‌హాళ్లను ఏర్పాటుచేసింది. మొత్తం 536 స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశించిన లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు లెక్కించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తరువాత పోలింగ్ కేంద్రాలవారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు.

అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడదీసి 25 బ్యాలెట్ పత్రాలను ఒక్కో బండిల్‌గా చుట్టనున్నారు. రెండోదశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారు. చేశారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించే విధంగా ఏర్పాట్లుచేశారు. ఒక రౌండ్‌లో వెయ్యిఓట్లు లెక్కించనుండగా.. ఒక్కోస్థానానికి రెండురౌండ్లు ఏర్పాటుచేశారు. పరిషత్ ఓట్ల లెక్కింపునకు 11,882 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో కలుపుకుని మొత్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. లెక్కింపును సాయంత్రం 5 గంటల వరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

పరిషత్ లెక్కింపు ఫలితాలను ఎస్‌ఈసీ ఈ సారి వెంటవెంటనే వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నది. ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఇందుకోసం ప్రత్యేక సదుపాయం కల్పించారు. వెబ్‌సైట్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు అంటూ ఉండే ఆప్షన్‌పై క్లిక్‌చేస్తే.. అప్పటివరకు జరిగిన ఫలితాలను వెల్లడవుతాయి.

- Advertisement -