ఆ కుక్క ఖరీదే రూ.20 కోట్లు!

55
- Advertisement -

అవును మీరు వింటున్నది నిజమే. ఆ కుక్క ఖరీదు అక్షరాల రూ.20 కోట్లు. బెంగళూరులోని కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ వద్ద ఈ డాగ్ ఉండగా దీనిని ఈనెల 16న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్‌ మదీనాగూడలోని విశాల్ పెట్ క్లీన్ వేదిక కానుంది.

ఈ కుక్క వయస్సు రెండు సంవత్సరాలు. 100 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ కుక్క ఆడ సింహం అంత పెద్దదిగా ఉంటుంది. కుక్క తల 38 అంగుళాలు, భుజాలు 34 అంగుళాల పొడవు. కాకాసియన్ షెపెర్డ్ జాతి కుక్కలు ముఖ్యంగా జార్జియా, అర్మేనియా, అజర్‌బైజాన్, ఒస్సేటియా, సిర్కాసియా, టర్కీ, రష్యా వంటి దేశాల్లో కనిపిస్తాయి.

పశువులను వేటాడే జంతువుల నుండి రక్షించడానికి, ఇంటి భద్రత కోసం ఈ కుక్కలను పెంచేవారు. గంభీరంగా కనిపించే ఈ కుక్కలు చాలా చురుగ్గా ఉంటాయి. డేర్ డెవిల్స్‌గా పేరున్న ఈ జాతి కుక్కలు సాధారణంగా 10-12 సంవత్సరాలు జీవిస్తాయి.

Also Read:ఫైనాఫిల్ జ్యూస్ తాగుతున్నారా!

- Advertisement -