రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ వద్ద జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురి అవుతున్న సందర్భంలో ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ నందు మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.
ఈరోజు కరోనా సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు వదలడం జరుగుతుందని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందు తీసుకోబోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.
అదేవిధంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను కూడా మా డివిజన్ పార్టీ నాయకుల సహకారంతో అందించడం జరిగిందని అదేవిధంగా నాయకులు కూడా ఎవరూ కూడా కేక్ కటింగ్ ఇతర హంగు ఆర్భాటాలు లాంటి లేకుండా మొక్కలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని అదే విధంగా పేద ప్రజలను ఆదుకునే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కృష్ణ మోహన్, మహేష్ గుప్తా, విజయ్ కుమార్ తహేరు, బషీర్, టీఆర్ఎస్‌వీ నాయకులు కిషోర్ గౌడ్, వినీత్, అనిల్, నందగోపాల్ గౌడ్,NN రాజు, అబ్బు తదితరులు పాల్గొన్నారు.