కార్పొరేట్ స్థాయిలో సర్కార్ స్కూళ్‌…

72
- Advertisement -

తెలంగాణలో  ప్రభుత్వ బడులను నేటి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లుతున్న సీఎం కేసీఆర్‌ కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమంను విజయవంతంగా…ప్రభుత్వ పాఠశాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్‌లో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వసతులు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో ఒకేసారి 700చోట్ల ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక వైపు నాణ్యమైన బోధన అందిస్తూనే మరోవైపు పాఠశాలలకు ఆధునిక వసతులను చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌లో బోధన ప్రారంభించామన్నారు.

తెలంగాణలో రానున్న రోజుల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టీచర్ల ప్రమోషన్లు తర్వాత భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన మేయర్ నీలా గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

కేంద్ర బడ్జెట్…ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

బడ్జెట్‌ మధ్యలో నవ్వించిన నిర్మలా..

7 లక్షల వరకు నో ట్యాక్స్‌..

- Advertisement -