కరోనా వైరస్ వ్యాక్సిన్ రావడానికి 18 నెలల సమయం పడుతుందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ్యబ్లూహెచ్‌వో). కరోనా సంక్రమించిన వారికి సరైన చికిత్సను అందించాలని డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. మందు తయారీ కోసం ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నట్లు టెడ్రోస్ తెలిపారు. స్పెయిన్, ఇటలీ పేషెంట్లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నామని, ఇది చరిత్రాత్మకమవుతుందన్నారు.
ప్రాణాలను రక్షించాలంటే సూట్లు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్లు అత్యవసరం అన్నారు.వైద్య సేవలు అందించే హెల్త్ వర్కర్లు ప్రమాదంలో ఉంటే, మనం అందరి జీవితాలు కూడా ప్రమాదంలో ఉన్నట్లే అని టెడ్రోస్ పేర్కొన్నారు.
కరోనా బాధితుల ట్రీట్మెంట్లో ఎదురవుతున్న సవాళ్లను అనేక దేశాలు తమతో పంచుకున్నట్లు ఆయన చెప్పారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కిట్ల ఉత్పత్తి, టెస్టింగ్‌ను పెంచనున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న వారెవ్వరూ స్వంత మందులను వాడకూడదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.