- Advertisement -
కరోనా ఎఫెక్ట్‌తో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సైతం కరోనా ఎఫెక్ట్ తగిలింది. నేటి నుంచి మార్చి 31వరకు యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
లఘు దర్శనానికి మాత్రమే అనుమతిచ్చామని.నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేష కండనం రద్దు చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ నివారణకు.. ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహ ధన్వతరి జపా హోమం నిర్వహిస్తామని ఆర్చకులు తెలిపారు.
ఇక నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి చెరువు గట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం రేపటి నుంచి ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -