ప్రపంచవ్యాప్తంగా 19.97 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.26లక్షల మంది మృతి చెందారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.78 లక్షల మంది కోలుకున్నారు.
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 వరకు కఠినమైన లాక్‌డౌన్ జరగనుండగా ఏప్రిల్ 20 తర్వాత షరతులతో సడలింపు ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 339 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 1036 మంది కోలుకున్నారు
తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి చెందారు.తెలంగాణలో మొత్తం 110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కి చేరింది.ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా నుంచి కోలుకుని 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.