చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జనాలు గుమిగూడొద్దని అధికారులు ఆదేశిస్తున్నారు. సినిమా హాల్స్, పబ్బులు, క్లబ్బులను మూసేస్తున్నారు.
ఇదిలావుంటే మరోవైపు కొన్ని వ్యాపార సంస్థలు కరోనా పేరును వాడుకొని సొమ్ము చేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా గురించి తెలియని వారు ఉండరు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయితే ఈ ‘కరోనా’ మాటనే తన వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడో వ్యాపారి.
ఇక అసలు విషయానికి వస్తే.. జర్మనీలోని ఎర్‌ఫర్ట్‌లో రోత్ అనే వ్యాపారి బేకరీ నడుపుతున్నాడు. కరోనా భయంతో బేకరీకి వినియోగదారులు రాకపోవడంతో అమ్మకాలు పడిపోయి వ్యాపారం బాగా దెబ్బతింది. దీంతో వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకున్న రోత్‌కు ఓ ఆలోచన వచ్చింది. అందరు కరోనా గురించి భయపడుతున్నారు కాబట్టి..
కస్టమర్స్‌ను ఆకట్టుకునేందుకు కరోనా వైరస్ ఆకారంలో ఉన్న కేకులను తయారు చేసి అమ్మకానికి ఉంచాడు దీనికి ‘కరోనా యాంటీ బాడీ ప్రాలైన్స్’ పేరు పెట్టాడు. ఈ కేకులను రకరకాల రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్న ఈకేకులను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయంటూ ప్రచారం చేస్తున్నాడు.దేన్నయితే చూసి జనం భయపడిపోతున్నారా దాన్నే తినడంటూ ప్రచారం చేస్తూ రూత్ తన వ్యాపారాన్ని క్రమంగా పెంచుకుంటున్నాడు. ఈ సరికొత్త ఆలోచనను చూసి జనాలు,ఇతర వ్యాపారస్తులు నిర్గాంతపోతున్నారు.