కరోనా.. ఉస్మానియా డాక్టర్లపై దాడి..!

400
attacks PG doctors
- Advertisement -

ఈ రోజు ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..వాళ్ళను గాంధీకి షిఫ్ట్ చేశారు. అయితే ఇద్దరికి పాజిటివ్ రావడంతో అదే వార్డులో ఉన్న కరోనా అనుమానితుడు అన్వర్ అలీ తండ్రి డాక్టర్స్‌పై దాడి చేశాడు. పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో నా కొడుకును ఇంటికి తీసుకుపోతాను అని తండ్రి డాక్టర్లతో వాగ్వదం చేశాడు. అయితే రిపోర్ట్స్ వచ్చేవరకు ఉండాలన్న వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పేషంట్ తండ్రి, వైద్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పిజి డాక్టర్‌లపై పేషంట్ తండ్రి దాడి చేశాడు.

దీంతో ఈ దాడికి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి సర్టెండెంట్ ఛాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఐసోలేషన్ వార్డును ఉస్మానియా నుండి తెసేయాలని.. ఉస్మానియను నాన్ కోవిడ్ -19హాస్పిటల్‌గా ప్రకటించిన ఇక్కడ ఐసోలేషన్ వార్డును పెట్టడం ఏంటి అన్ని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -