గ్రామల్లో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు..

512
- Advertisement -

కరోనా క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రజలే కాకుండా పల్లెలోని ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారి గ్రామాలకు వేరే ప్రదేశాల నుండి వచ్చే వారిని అనుమతించకుండా గ్రామ సరిహద్దుల్లో కంచెలు వేసి పహార కాస్తున్నారు. ఈ లాంటి సంఘటన నల్గొండ జిల్లాలోని మర్రిగూడం మండలం నామాపురంలో జరిగింది. గ్రామంలో గ్రామ సరిహద్దుల్లో ముళ్ల కంపను కంచెగా వేసి, వేరే గ్రామాల వారిని ఎవ్వరిని తమ గ్రామానికి రానివ్వకుండా యువకులు గస్తీ కాస్తున్నారు.

నార్కెట్ పల్లి మండలం అమ్మనబోల్ గ్రామంలో గ్రామ సరిహద్దుల్లో ముళ్ల కంపను కంచెగా వేసి, వేరే గ్రామాల వారిని ఎవ్వరిని తమ గ్రామానికి రానివ్వకుండా యువకులు,సర్పంచ్ గస్తీ కాస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లోకి రాకుండా వారికి వారే కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతి గ్రామాలకు అడ్డంగా కంచెలు, మూళ్ళ కంచెలు వేసి రహదారులను మూసేస్తున్నారు.

Corona effect

- Advertisement -