దనియాల కషాయం..ఉపయోగాలు!

1019
- Advertisement -

దనియాలను వంటింటి మసాలా దినుసుల్లా వాడుతుంటాము. ఎటువంటి కూరలోనైనా దనియాల పొడి వేస్తే ఆ రుచి అమోఘం. దనియాల పొడి వేయడం వల్ల వంటకాలకు గుమగుమలాడే సువాసన సంతరించుకుంటుంది. అందుకే ఎటువంటి కూర అయిన అందులో దనియాల కంపల్సరీగా వాడతారు. అయితే కేవలం కూరల్లోనే కాకుండా ఆయుర్వేద ఔషధలలో కూడా దనియాల పొడిని వాడుతుంటారు. ఎందుకంటే కొత్తిమీర గింజలుగా ఉండే దానియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. .

ఎదుకంటే ఇందులో విటమిన్ ఏ, కే, సి వంటి వాటితో పాటు ఫోలిక్ యాసిడ్, ఫైటోన్యూత్రీమెంట్ ఫోనొలిక్ సమ్మేళనాలు పలు రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దనియాలను కషాయం రూపంలో తీసుకుంటే ఎంతో మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో కొద్దిగా దనియాలు వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత వాడకత్తి ఆ కషయాన్ని ప్రతిరోజూ ఉదయం పడగడుపున తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయట. ఇంకా దనియాలలో ఉండే విటమిన్ సి కారణంగా ఈ కషాయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ప్రతిరోజూ దనియాల కషాయం తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందట. అంతేకాకుండా జలుబు దగ్గు, ఆయాసం వంటివి కూడా తగ్గుతాయట. దనియాలలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని ప్రీ రాడికల్స్ తో తొలగిపోతాయి. దనియాల కషాయంతో కొద్దిగా బెల్లం మరియు పాలు కలుపుకొని తాగితే నిద్ర లేమి సమస్య దూరమౌతుంది. ఇంకా దనియాల కషాయంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే తలనొప్పి, వాతం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణుల్ చెబుతున్నారు. కాబట్టి వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు దనియాల కషాయం తాగితే మంచిదట.

Also Read:అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

- Advertisement -