కల్టర్ నైల్‌ ఔట్‌..అండర్సన్ ఇన్

205
Corey Anderson replaces Coulter-Nile in RCB
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2018) మరి కొద్దిరోజులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతుండగా విరాట్ కోహ్లి నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ నాథన్ కల్టర్ నైల్ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు.

కల్టర్ నైల్ స్ధానంలో కీవిస్ విధ్వంసక ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ జట్టులోకి రానున్నాడు. ఆండర్సన్‌లో అపార ప్రతిభ ఉందని, అతడు చాలా విధ్వంసకరమైన రీతిలో ఆడతాడని, ఆర్‌సీబీ టీమ్‌లోకి స్వాగతం పలుకుతున్నామని ఆర్‌సీబీ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ చెప్పాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాతో ఆర్‌సీబీ తలపడనుంది.

ఇక ఐపీఎల్ ఆరంభం అంటే అదిరిపోవాల్సిందే. పదేళ్ల పాటు కన్నులపండువగా సాగిన ఐపీఎల్ ప్రారంభం సంబరాలు 11వ సీజన్ తో మారబోతున్నాయి. ఇంతకాలం ఐపీఎల్‌ ఓపెనింగ్ వేడుకలో ఎనిమిది ఫ్రాంచైజీలకు చెందిన కెప్టెన్లు కనిపించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం కేవలం ఇద్దరు కెప్టెన్లతోనే ఐపీఎల్ ఆరంభ వేడుక జరుగనుంది. ఏప్రిల్ 7న వాంఖడే స్డేడియం వేదిక ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కి ముందు ఈ సంబురాలు చేసేందుకు ఐపీఎల్ పాలక మండలి సిద్ధమైంది.

- Advertisement -