రాగి పాత్రలో నీరు తాగడం.. మంచిదేనా?

18
- Advertisement -

రాగి పాత్రలను వంటింట్లో ఉపయోగించడం పూర్వం నుంచి కొనసాగుతోంది. ప్రస్తుత రోజుల్లో కూడా రాగి పాత్రలను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కొన్ని చోట్ల రాగి పాత్రలను ఉపయోగించడం స్టేటస్ కు సింబల్ గా కూడా మారిపోయింది. రాగి చెంబులలో నీరు త్రాగడం, రాగి ప్లేట్ లలో భోజనం చేయడం.. ఇలా ఆయా అవసరాల నిమిత్తం రాగి పాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా రాగి పాత్రలను ఉపయోగిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయనేది మాత్రం చాలమంది తెలియదు. రాగి పాత్రలలో నీరు త్రాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నీటిని శుద్ది చేసేందుకు వాటర్ ప్యూరిఫైర్ లను ఉపయోగిస్తుంటాము. అయితే రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచి తాగడం వల్ల వాటర్ సహజసిద్దంగా ఫిల్టర్ అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. .

రాగి పాత్రలలోని నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. ఇంకా ఆయుర్వేదం ప్రకారం త్రికరదోషాలుగా చెప్పే (కఫ, పిత్త, వాత ) వంటివి దూరమౌతాయట. ఇంకా గుండె జబ్బులు ఉన్నవారు, అధిక రక్తపోటుతో బాధ పడే వారు తప్పకుండా రాగిపాత్రలోనే నీరు తాగాలని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. అంతే కాకుండా బరువును అదుపులో ఉంచడం, రోగ నిరోదక శక్తిని పెంచడం, కీళ్ల నొప్పులు, వాపు, తదితర సమస్యలను దూరం చేయడం.. వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. రాగిని యాంటీ మైక్రోబయల్ గా చెబుతుంటారు. కాబట్టి చలికాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్స్ ను కూడా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. కాబట్టి రాగిపాత్రలలో నీరు తాగడం ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:చింతపండుతో ఉపయోగాలు తెలుసా?

- Advertisement -