లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కూలీ. నాగార్జున వి,కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్,బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కార్తీతో ఖైదీ ,ఆ తర్వాత కమల్‌తో విక్రమ్ , విజయ్‌తో లియో వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు లోకేశ్ కనగరాజ్. తాజాగా కూలీ మూవీని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేయాలని భావిస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ ధరకు సంబంధించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రూ.125 కోట్ల రికార్డు ధరకు కూలీ టీటీ ఢీల్ కుదిరినట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:ఉత్తమ్ ద్రోహి..కృష్ణ జలాల కోసం పోరాడింది బీఆర్ఎస్