ఓటీటీలోకి రజనీకాంత్..కూలీ!

6
- Advertisement -

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రమైన కూలీ త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా ప్రైమ్ వీడియో ఓటీటీ రిలీజ్ డేట్‌ను చివరి క్షణంలోనే ప్రకటించే సంప్రదాయం ఉన్నా, ఈసారి ముందుగానే అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే లోకేష్ కనగరాజ్‌పై సినిమా హాఫ్‌బేక్డ్ ఎగ్జిక్యూషన్ గురించి ట్రోల్స్ వస్తున్నాయి. కింగ్ నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే స్పెషల్ క్యామియోస్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

Also Read:పాత వీడియో..తప్పు ఒప్పుకున్నా:వంటేరు

- Advertisement -