నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత..

476
- Advertisement -

నిర్భయ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. దోషులకు ఉరి ఖరారైనా.. అమలు కావడానికి అడ్డంకులు ఎడురౌతున్నాయి. ఇక ఈ కేసులో దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పటికే పవన్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్‌ వారెంట్‌లో పేర్కొంది. నిర్భయ దోషులంతా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఉరిశిక్షను అమలు చేయాల్సిన నేపథ్యంలో వారిని జైల్లోని మూడో నంబరు కారాగారానికి తరలించారు.

nirbha

పవన్ గుప్తా వేసిన పిటిషన్ ను జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ ను పరిశీలించాల్సిన అంశాలేవీ ఇందులో తమకు కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయరాదని, పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

- Advertisement -