వాల్మీకిని గ్యాంగ్‌స్టర్‌ చేస్తారా?..వరుణ్‌ మూవీపై వివాదం..!

267
Controversy on Varun Tej's Valmiki
- Advertisement -

ఎఫ్‌ 2 సినిమాతో మంచి జోష్‌ మీదున్న మెగా హీరో వరుణ్ తేజ్‌ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తమిళ మూవీ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వాల్మీకి అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. తమిళ రిమేక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టర్ స్టోరీ అలాంటి కథకు వాల్మీకి అనే టైటిల్‌ని ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. వాల్మీకి దొంగ కాదని హర్యానా హైకోర్టు కూడా తీర్పునిచ్చిందని, ఆయన పేరును గ్యాంగ్‌స్టర్ సినిమాకు పెట్టడం సరికాదని ఈ పేరును తక్షణమే తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, హరీష్ శంకర్ గత చిత్రం డీజే సినిమాలోని ఓ పాట కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనిఓ పాట తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందని బ్రాహ్మణ సామాజికవర్గం ఆందోళనకు దిగగా వెనక్కితగ్గిన హరీష్ ఆ పాటలో మార్పులు చేశారు. తాజాగా ఇప్పుడు ‘వాల్మీకి’ టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో హరీష్ ఏ విధంగా స్పందిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -