షిర్డి ఆలయం తెరిచే ఉంటుంది: ట్రస్ట్ బోర్డు

495
sai baba
- Advertisement -

షిర్డి సాయిబాబా జన్మస్ధలంపై వివాదంతో మహారాష్ట్రలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పత్రి జిల్లాలో రూ. 100 కోట్లతో సాయిబాబా ఆలయాన్ని నిర్మిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించడంపై షిర్డి గ్రామస్తులు మండిపడుతున్నారు.

ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ నిరవధికంగా షిర్డి బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే షిర్డి బంద్‌తో తమకు సంబంధం లేదని సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుందని తెలిపారు ట్రస్ట్ బోర్డు సభ్యులు.

సాయిబాబా జన్మస్థలం పర్బనీ జిల్లాలోని పత్రి అని కొందరు భక్తులు విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రూ.100 కోట్లతో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామనిప్రభుత్వం ప్రకటించింది. దీంతో అసలు వివాదం మొదలైంది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని బీజేపీ తెలపగా… మంత్రి అశోక్‌ చవాన్‌ మాట్లాడుతూ పత్రిలో భక్తుల కోసం వసతులను కల్పించడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు.

- Advertisement -