హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత జట్టు యజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. టీమిండియా సారథిగా రోహిత్ తన ప్రతిభ కనబరుస్తున్నడని, ఐపీఎల్ లో కూడా ముంబైకి ఏకంగా ఐదు సార్లు కప్పు అందించిన ఘనత రోహిత్ దే అని.. అలాంటి హిట్ మ్యాన్ కు కెప్టెన్సీ దూరం చేయడం ఏంటని అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. రోహిత్ కు బదులుగా ముంబై కెప్టెన్సీ బాద్యతలను హర్ధిక్ కు కట్టబెట్టింది టీం మేనేజ్మెంట్. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ టైమ్ లో టీం యజమాన్యం పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ దీనిపై స్పందించాడు. ” రోహిత్ కు ఆటగాడిగా స్వేచ్చనిచ్చేందుకే కెప్టెన్సీ నుంచి తప్పించామని, ఇది ముంబై జట్టు భవిష్యత్ ప్రణాళికలో భాగంగా తీసుకున్న నిర్ణయమని, ఈ విషయంలో ఎవరు ఎమోషన్స్ కు గురి కావొద్దని ” బౌచర్ చెప్పుకొచ్చాడు..
అయితే ఆయన చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రోహిత్ శర్మ సతీమణి రితిక స్పందిస్తూ ” రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక తప్పులున్నాయని ” ఇన్స్టా లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిట్ మ్యాన్ అభిమానులు కూడా బౌచర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. రోహిత్ శర్మ గత ఐపీఎల్ సీజన్ లో మంచి ప్రతిభ కనబరిచడాని అలాంటి ప్లేయర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక టీం మేనేజ్మెంట్ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు కొందరు అభిమానులు. మొత్తానికి రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఇప్పటికీ కూడా చర్చనీయాంశం అవుతూనే ఉంది. మరి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఈ రచ్చ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
Also Read:TTD:బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్