ఎంపీ కావ్య అక్రమ ఎక్స్ అఫిషియో ఓటు!

4
- Advertisement -

తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటు నమోదు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం, కడియం కావ్య తొలుత ఎక్స్ అఫిషియో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోగా, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. అయితే అనంతరం ఆమె మరోసారి దరఖాస్తు చేయకపోయినా, పైస్థాయి నుండి అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు అధికారులే స్వయంగా ఎక్స్ అఫిషియోగా ఆమె ఓటును నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకసారి నిబంధనలు చూపిస్తూ తిరస్కరించిన అధికారులు, మళ్లీ అదే విషయంలో ఎలా అనుమతిచ్చారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దరఖాస్తు లేకుండా ఓటు నమోదు చేయడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని వారు అంటున్నారు. ఈ చర్య వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:నాగబంధం..బైరాగిగా గరుడ రామ్‌

- Advertisement -