మోడీ – జగన్.. మధ్య వైరం?

39
- Advertisement -

ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య ప్రత్యేక్ష పొత్తు లేనప్పటికి మొదటి నుంచి కూడా ఈ రెండు పార్టీలు అంతర్గత స్నేహం కొనసాగిస్తున్నాయనే వాదన వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే మోడీ సర్కార్ పై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రతికూల విమర్శలు చేయకపోవడం. బీజేపీ నేతలు కూడా జగన్ పాలన తీరును పెద్దగా ప్రతిఘటించకపోవడం వంటి కారణాలను బట్టి జగన్ బీజేపీ పెద్దల మద్య సత్సంబంధాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోనూ, విశాఖ ప్రయివేటీకరణ అంశంలోనూ.. ఇలా ప్రతిదాంట్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసినప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రశ్నించలేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామని చెబుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీర అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచిపోయారు.

ఇలా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్న వైఎస్ జగన్.. ఒకానొక సందర్భంలో ఎన్డీయేలో చేరతారనే వార్తలు కూడా వినిపించాయి. కట్ చేసే ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన జట్టు కట్టాయి. దీంతో ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయని జగన్మోహన్ రెడ్డి ఇకపై కేంద్రంపై ఎలా వ్యవహరిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అటు బీజేపీ పెద్దలు కూడా జగన్ పాలనపై పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఇకపై వైసీపీపై విమర్శలు చేయకతప్పదు. ఇకపోతే నేడు చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన బీజేపీ కూటమి యొక్క సంయుక్త సభ జరగనుంది. ఈ సభ కు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థి జగన్ పార్టీనే కావడంతో మోడీ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మోడీ వర్శస్ జగన్ రాజకీయం ఎలాంటి చర్చలకు దారి తీస్తుందనేది క్యూరియాసిటీని పెంచుతున్న అంశం.

Also Read:పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

- Advertisement -