ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ జరిగింది. ఏయూలో విద్యార్ధి మణికంఠకు ఫిట్స్ వచ్చి మృతి చెందాడు అని…అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు అన్నారు మంత్రి నారా లోకేష్.దీన్ని కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారు… విద్యాలయాల్లో రాజకీయ జోక్యం కరెక్ట్ కాదు అన్నారు.
ఏయూని టాప్ లో ఉంచాలన్నదే మా లక్ష్యం… విద్యాలయాల్లో రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలు తప్పవు అన్నారు. యూనివర్సిటీల్లో జరిగే అవకతవకలపై కమిటీ వేస్తాం… ఏయూలో ఒక విద్యార్థి చనిపోయాడు, మనం కాపాడుకోలేకపోయాం అన్నారు. కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడుతున్నారు… తప్పు జరిగితే ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ, ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు… కొంత మంది వాళ్ల స్వార్ధం కోసం యూనివర్సిటీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం అన్నారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది ఏయూ. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ చాంబర్ల ముట్టడించారు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు. కనీస వసతులు కల్పన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వీసీ జిపి రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్

