యానిమల్ సినిమా పై ఇప్పుడు కొందరు పనిగట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా మూర్ఖుడు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. సినిమాని సినిమాలా చూడకుండా ఎందుకు ఈ వివక్ష ?, దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొన్ని సీన్లు కొందరికి అస్సలు నచ్చలేదు. బుర్ఖా వేసుకున్న స్త్రీ లు సిగరెట్లు తాగే సీన్ ఉంటుంది ఈ సినిమాలో. ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసిన ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఈ సీన్ ఎఫెక్ట్ ఎలాంటిది అంటే.. అమెరికాలో ఉంటున్న ఓ ముస్లిం వ్యక్తి ‘సినిమాలో ముస్లీం స్త్రీలు మందు తాగడం, సిగరెట్లు తాగడం చూపించారు అది నాకు నచ్చలేదు అని అమెరికాలో ఉంటున్న తెలుగు ముస్లిం వ్యక్తులు చెప్పడాన్ని బట్టి, ఈ సినిమా పై వచ్చే విమర్శలు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఆ మాటకొస్తే.. ఈ సినిమాలో ముస్లిం మగ వాళ్ళను హంతుకులుగా కూడా చూపించారు. దానికి లేని అభ్యంతరం ఆడవాళ్ళ సీన్లకు వచ్చింది. ఎందుకంటే మత విశ్వాసాలు కూలి పోవడానికి మొదటి మెట్టు స్త్రీ స్వాతంత్య్రం. ఇక “రా నెస్” …..ప్రేమను, సెక్స్ ను దాచుకునేలా చేసిన సంస్కృతి మనది. అలాంటి చోట తన భార్యను ఎంత మంది ఉన్నా పట్టించుకోకుండా ముద్దు పెట్టుకోగల తెగింపు, హత్తుకోగల కనీస మానవ స్వేచ్ఛను కూడా మనకు లేకుండా చేయడం ప్రేమ ఎలా అవుతుంది ? అని ఈ సినిమా నేరుగా ప్రశ్నించింది. సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇవేమీ నచ్చవు.
అయినా, ఇవన్నీ ఎన్ని చెప్పినా.. మొదటి సినిమా నుండి సందీప్ రెడ్డి వంగా మీద ఇలాంటివి బోలెడు కంప్లైంట్ లు ఉన్నాయి. అతనిలో ఇంటిగ్రిటీ లేదు. తను వెధవ పని చేసినా దానిలో ఏదో లోక కళ్యాణం ఉంది అని అతని హీరో మనలని నమ్మిస్తాడు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అని అడిగే వాళ్ళు ఈ సినిమా చూడకండి. ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీ తో చూడలేరు. ఈ యానిమల్ ప్రేమ.. యానిమల్ పార్క్ లోని మృగం ప్రేమలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి అదే పెద్ద సమస్య.
Also Read:BJP:తెలంగాణలో కమలం వికసిస్తుందా?