ఆనంద్ దేవ‌ర‌కొండ ‘బేబీ’ ఎవరిది? 

59
- Advertisement -

ఆనంద్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వి చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న చిత్రం బేబీ. జులై 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్ట‌ర్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ అప్డేట్ అతి త్వ‌ర‌లోనే రానుందని నిర్మాత SKN చెప్పుకొచ్చాడు. అయితే, ఈ సినిమా కథ తనది అంటూ అవినాష్ అనే యువ దర్శకుడు రచయితల సంఘంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బేబీ కథకు సంబంధించిన ప్రతి సీన్ ను తానే రాశాను అని, తనను దర్శకుడు సాయి రాజేష్ మోసం చేశాడని అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు.

అయితే, సాయి రాజేష్ తో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. అతను చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదు అని, బేబీ కథకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా కథ పూర్తిగా తమదే అని, సాయి రాజేష్ గారు ఎంతో కష్టపడి ఈ సినిమాని మలుస్తున్నారు అని, ఇప్పుడు సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉన్న సమయంలో ఎవరో వ్యక్తి వచ్చి కథ నాది అంటే.. చాలా కామెడీగా ఉందని.. దయచేసి ఇలాంటి పుకార్లను పుట్టించొద్దు అని ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

Also Read:టమాటో దొంగలు…పోలీసుల ఎంట్రీ

అనట్టు విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా పరాజయంపై కూడా ఆనంద్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్నయ్య వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయనతో నత్తి పాత్ర చేయించడం కొంతమంది సినీ ప్రియులకు నచ్చలేదు. సినిమా ఫ్లాప్‌కి అదీ ఒక కారణం అయ్యి ఉండొచ్చు. విజయ్ ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. మార్నింగ్ షోకే మూవీ రిజల్ట్ మాకు తెలిసిపోయింది’’ అని అన్నారు.

Also Read:KTR:నిరుద్యోగ భారతం..సరికొత్త స్ధాయికి

- Advertisement -